ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – “7 డేస్ 6 నైట్స్” ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు

ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – “7 డేస్ 6 నైట్స్” ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు

Published on Jun 18, 2022 5:00 PM IST

 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టర్న్డ్ దర్శకుడు అయినటువంటి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ”7 డేస్ 6 నైట్స్”. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు.ఈ జూన్ 24న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా సుమంత్ అశ్విన్ లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

హీరోగా స్టార్ట్ అయ్యి పదేళ్లు అవుతుంది ఇప్పటి వరకు ఇక ముందు ఎలా ఉండాలి అనుకుంటున్నారు?

నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. ఈ పదేళ్లు టైమ్ తెలియకుండా చాలా స్పీడుగా వెళ్ళింది. హ్యాపీగా ఉన్నాను. కొత్త నిర్ణయాలు అంటే… ఆల్రెడీ చేసిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త రోల్స్, రిలేటబుల్ రోల్స్ చేయాలని ఉంది.

 

ఈ చిత్రంలో మీ రోల్ ఎలా ఉంటుంది చెప్పండి?

ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే… ఇందులో డిఫరెంట్ రోల్ చేశా. ఇంతకు ముందు చేసినవి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ… కొన్ని అంశాలు లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్ ఉంటుంది. ‘7 డేస్ 6 నైట్స్’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్ చేశా. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు… ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్‌డేట్‌ అయ్యారు. వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను.

 

మరో హీరో రోహన్, హీరోయిన్స్ రోల్స్ గురించి చెప్పండి?

రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే… ఆమెను ‘సతి’ సినిమాలో కూడా తీసుకున్నాం.

 

ఈ ఫాథర్స్ డే సందర్భంగా మీ నాన్న గారి కోసం చెప్పండి?

నేను ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి. ప్లాన్ చేస్తున్నాను. అయితే, ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ‘7 డేస్ 6 నైట్స్’ కాపీ చూపించారు. సినిమా చాలా బావుంది. నేను చాలా హ్యాపీ. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే… మరో జన్మంటూ ఉంటే, దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే ‘మళ్ళీ హైదరాబాద్ లో ఎంఎస్ రాజు గారి అబ్బాయిలా పుట్టాలి’ అని కోరుకుంటా. ఆయన ఎటువంటి ఫాదర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే నాన్న అది ఇచ్చారు. నాన్న పర్ఫెక్ట్ ఫాదర్. ఎన్ని జన్మలెత్తినా… ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలని కోరుకుంటున్నా.

 

ఈ సినిమా మీ నాన్న గారి సినిమా ని చేసారా లేక కథ నచ్చి చేసారా?

రెండూ! ఇప్పుడు నాన్నగారు ఒక ఫైర్ లో ఉన్నారు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. ‘డర్టీ హరి’తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మధ్యలో ఎక్కడో ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్… ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్’ అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి… నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. ‘7 డేస్ 6 నైట్స్’లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది.

 

మీకు డైరెక్టర్ అవ్వాలని ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా?

చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి… నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. ‘వర్షం’ సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే… నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి ‘చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు’ అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా.

 

ఫైనల్ గా ఈ ‘7 డేస్ 6 నైట్స్’ ఫ్యామిలీతో చూసేలా ఉంటుందా?*

నేను కాపీ చూసినప్పుడు నాతో పాటు మా అమ్మ, సిస్టర్ కూడా ఉన్నారు. మా ఇంట్లో సినిమా అని కాదు… చీప్‌గా ఉంటే వాళ్ళతో కలిసి చూడలేం. ఇబ్బంది పడే సన్నివేశాలు ఉండవు. నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు