ప్రత్యేక ఇంటర్వ్యూ : ప్రభాస్ – 10 సంవత్సరాలు టాప్ లో ఉంటే నువ్వే నెంబర్ వన్ హీరో

ప్రత్యేక ఇంటర్వ్యూ : ప్రభాస్ – 10 సంవత్సరాలు టాప్ లో ఉంటే నువ్వే నెంబర్ వన్ హీరో

Published on Feb 17, 2013 9:00 PM IST

Prabhas3

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా ‘మిర్చి’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఎంతో ఆనందంగానూ, ఎంతో రిలాక్స్ గానూ ఉన్నాడు. అలాగే ఎస్.ఎస్ రాజమౌళి తో చేయనున్న ‘బాహుబలి’ సినిమా కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అలాంటి ప్రభాస్ తో ఈ రోజు మేము కాసేపు ముచ్చటించాము. ప్రభాస్ పూర్తి గడ్డంతో, కండలు తిరిగి ఉన్న బాడీతో ఉన్నారు. ఇంతకీ ప్రభాస్ ‘మిర్చి’ సినిమా గురించి, తన రాబోయే ‘బాహుబలి’ సినిమా గురించి, అలాగే తన కెరీర్ ప్లాన్స్ గురించి ఏమి చెప్పాడో మీకోసం అందిస్తున్నాం..

ప్రశ్న) చూస్తుంటే చాలా ఎక్కువగా వర్కవుట్ చేస్తున్నట్టున్నారు..?

స) (నవ్వుతూ). అవును. నా బాడీ లుక్ ని మార్చుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను. ఇదంతా నా రాబోయే సినిమా ‘బాహుబలి’ కోసం, ఈ సినిమాలో నేను కండలు తిరిగిన బాడీతో సాలిడ్ లుక్ తో కనిపిస్తాను.

ప్రశ్న) ‘మిర్చి’ సినిమాని బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేసారు. మీరెలా అఫీలవుతున్నారు?

స) నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా నా విజయాన్ని నా క్లోజ్ ఫ్రెండ్స్, కజిన్స్ తో పంచుకుంటాను, కానీ నేను ఈ సినిమా నా ఫ్రెండ్స్, కజిన్స్ తో తీయడం వల్ల ఈ సక్సెస్ నాకు రెట్టింపు ఆనందాన్నిచ్చింది, అలాగే ఈ సక్సెస్ నాకెంతో స్పెషల్.

ప్రశ్న) కొంతమంది ‘మిర్చి’ సినిమా వన్ మాన్ షో అని అంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏమిటి?

స) ఆ స్టేట్మెంట్ ని నేను ఒప్పుకోను. ఇది వన్ మాన్ షో సినిమా కాదు, ఇది టీం అందరి ఎఫోర్ట్. ఉదాహరణకి అనుష్కనే తీసుకోండి.. తెరపై ఆమె సీన్స్ కి విజిల్స్ వేస్తున్నారు దాన్నిబట్టే ఆమెకి ఎంత స్టార్ పవర్ ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈ సినిమా వన్ మాన్ షో అంటారా? చెప్పండి.

ప్రశ్న) మీ వరకూ ‘మిర్చి’ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏదంటారు?

స) నా వరకూ బెస్ట్ పార్ట్ నెరేషన్, సినిమాని నేరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక కొత్త నవలలా అనిపించింది. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే వారికి కూడా సినిమా నచ్చిందన్నమాట.

ప్రశ్న) ఈ సినిమా కథ గతంలో వచ్చిన కొన్ని తెలుగు సినిమాలతో పోలికలున్నాయి, దీనిపై మీ స్పందన ఏమిటి?

స) (నవ్వుతూ) ఇది ఒక కమర్సియల్ సినిమా. ఎంటర్టైనింగ్ గా సాగే ప్రతి కమర్షియల్ సినిమా ఏదో ఒక స్టొరీ ని చూసి స్ఫూర్తి గా తీసుకుని రాసుకుందే. నా దృష్టిలో అది సమస్య కాదు, స్క్రీన్ ప్లే లేదా చూపించే విధానంలో కొత్త ధనం ఉండాలి అది చాలు. మీకు అలా పూర్తిగా కొత్త ధనం ఉండే సినిమాలు తీయాలంటే మా నుంచి మూడు సంవత్సరాలకి ఓ సినిమా వస్తుంది, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లాగా..(నవ్వుతూ).

ప్రశ్న) మీరు కమర్సియల్ సినిమాలకే అంకితం అవుతారా లేక వాటితో పాటూ ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తారా?

స) ప్రయోగాత్మక లేక ఆర్ట్ సినిమాలు చెయ్యను. నేను ఎంటర్టైనింగ్ సినిమాలకే పరిమితమవుతాను. నా ఇమేజ్ పరిధిలోనే ప్రయోగాలు చేస్తాను. ఉదాహరణకి ‘డార్లింగ్’, ‘Mr . పర్ఫెక్ట్’ లాంటి ప్రయోగాలు ఎందుకంటే అప్పటి వరకూ నేను ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేయలేదు. ‘చక్రం’ లాంటి సినిమా మళ్ళీ చెయ్యను.

ప్రశ్న) అలాంటి పాత్రలే చేస్తుంటే మీకు బోర్ కొట్టదా?

స) నేను వరుసగా యాక్షన్ సినిమాలు చేయడం వల్లే మార్పు కోసం ‘డార్లింగ్’, ‘Mr . పర్ఫెక్ట్’ లాంటి సినిమాలు చేసాను. నాకు కావాల్సిన కిక్ వచ్చింది అందుకే ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా కొంచెం డిఫరెంట్ సినిమాలు చేస్తాను. కానీ వాటిలో కూడా నా ఫాన్స్, ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ సమపాళ్ళలో ఉంటుంది.

ప్రశ్న) మీకు యంగ్ రెబల్ స్టార్ అనే టైటిల్ ఇచ్చారు, దాంతో మీరు సంతోషమేనా?

స) (ఆలోచిస్తుంటే).. నాకు అలాంటి టైటిల్స్ తో అంత సౌకర్యంగా అనిపించదు. సింపుల్ గా ప్రభాస్ అనే వాడుతుంటాను. ‘మిర్చి’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ అని వెయ్యొద్దని నా ఫ్రెండ్స్ ని అడిగాను వారు నన్ను కన్విన్స్ చేసి తెరపై వేశారు. నా ఫాన్స్ కి ఆ టైటిల్ అంటే ఇష్టం, వారిని నిరాశపరచడం ఎందుకు అని అడిగితే ఒప్పుకున్నాను. నాకు నా ఫ్రెండ్స్ చాలా ముఖ్యం, వారికి ఇష్టమైతే నాకూ ఇష్టం(నవ్వుతూ).

ప్రశ్న) ఒక సినిమా సక్సెస్ లో టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ పాత్ర ఎంతవరకూ ఉంటుంది?

స) ఓ సినిమాకి టెక్నీషియన్స్ చాలా చాలా ముఖ్యం. వారికి పేరు రాకపోయినా వారి పనితనమే సినిమా హిట్ లేదా ఫ్లాప్ ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఎడిటర్ ని తీసుకోండి సినిమా ఫైనల్ అవుట్ పుట్ అనేది ఎడిటర్ విజన్ లోనే ఉంటుంది. సినిమాకి ఎడిటర్ చాలా ముఖ్యం, కరెక్ట్ ఎడిటర్ అయితేనే సినిమాలో నుంచి ఏది తీసెయ్యాలి ఏది ఉంచాలి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా సక్సెస్ లో సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర పోషిస్తాడు. ‘మిర్చి’ సినిమా షూటింగ్ కి ముందే ఇండియాలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఎవరు ఉన్నారా అని వెతికాము. ఆర్. మది, ‘సైతాన్’ సినిమాలో అతని వర్క్ చాలా బాగుంది.

ప్రశ్న) దేవీ శ్రీ ప్రసాద్ తో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది దానిమీద మీ కామెంట్?

స) సినిమా సక్సెస్ లో కీలక పాత్ర దేవీ శ్రీ ప్రసాద్ అనే చెప్పుకోవాలి. మీరు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా దేవీ అదిరిపోయే సాంగ్స్ అందించాడు. ‘మిర్చి’ లో ‘పండగలా’, ‘కాటుక కళ్ళు’ నా నచ్చిన సాంగ్స్ అలాగే ‘డార్లింగే’ కూడా.

ప్రశ్న) ‘బాహుబలి’ సినిమాలో రానాతో కలిసి నటించనున్నారు, అతను ఈ సినిమాలో మీకు ప్రత్యర్థి గా కనిపించానున్నాడా?

స) దాని గురించి నేనిప్పుడే ఏమీ చెప్పలేను. కానీ ఫాన్స్ కి ఒక్కటి మాత్రం చెప్పగలను కొన్ని అదిరిపోయే సీన్స్ ఉంటాయి. రానా నాకు మంచి ఫ్రెండ్, ప్రస్తుతం మేమిద్దరం కలిసి కత్తి ఫైట్లు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటున్నాము.

ప్రశ్న) రాజమౌళి గారు సూపర్బ్ ఫాంలో ఉన్నారు అలాగే మీరు కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మీ కాంబినేషన్లో రానున్న ‘బాహుబలి’ పై భారీ అంచనాలున్నాయి..

స) అవును మీరన్నది నిజమే. రాజమౌళి టాలెంట్ తెలిసిన వారు అతన్ని మాస్టర్ డైరెక్టర్ అంటారు. ఆయనకి పని అంటే చాలా మక్కువ, నేను పూర్తిగా ఆయన్ని నమ్మాను. ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం ఏమిటంటే ఆయన అనుకున్నది చేసి ఆయన్ని సంతోష పెట్టడమే(నవ్వుతూ). ఆయన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టను, అలాగే ‘ఆబహుబలి’ పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చెయ్యను.

ప్రశ్న) మీ ఫేవరైట్ కో స్టార్ అనుష్కనేనా?

స) (నవ్వుతూ), అవును. ఆమెతో పనిచేస్తుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చాలా మంచి పర్సన్, అలాగే సెట్లో అందరినీ ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చేస్తుంటుంది.

ప్రశ్న) మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారి అమాంతం పెరిగిపోయింది, అదే మీ బాక్స్ ఆఫీసు స్టామినా. ప్రస్తుతం మీరు కూడా నెంబర్ వన్ రేస్ లో ఉన్నారా?

స) అసలు నెం 1 అంటే ఏంటో చెప్పండి. నా వరకూ హిట్స్, ఫ్లాప్స్ తో సంబందం లేకుండా 10 -20 సంవత్సరాలు ఎవరైతే ఇండస్ట్రీని రూల్ చేస్తారో వాళ్ళే నెంబర్ 1. నేనైనా లేక వేరే హీరో అయినా రెండు లేదా మూడు వరుస హిట్స్ కొట్టేస్తే అది నెంబర్ 1 స్థానం కాదు. (నవ్వుతూ) ఇప్పటి తరంలో అలాంటి వారిని ఇంకా చూడలేదు.

ప్రశ్న) మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు? మీ ఫ్రెండ్స్, మీ కో స్టార్స్ ఇప్పటికే సెటిల్ అయినట్టున్నారు?

స) ‘వాలు ఏదో చేసుకున్నారని నేను చేసుకుంటే బాగోదు గా'(నవ్వుతూ). నేనూ వాళ్ళాలా ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు చేసుకుంటా. ఈ సంవత్సరంలో ఉండక పోవచ్చు. వచ్చే సంవత్సరం ఉండవచ్చు.

ప్రశ్న) ‘మిర్చి’ సినిమాలో రెయిన్ ఫైట్ ని యాడ్ చేస్తున్నారా?

స) దాని గురిచి మాట్లాడటానికి సరైన పర్సన్ నేను కాదు. సరైన సమయం చూసుకొని డైరెక్టర్ కొరటాల శివ దాని గురించి తెలియజేస్తారు.

ప్రశ్న) ఇప్పటివరకూ మీ కెరీర్లో మీరు నిరాశ పడిన సందర్భాలున్నాయా?

స) (ఆలోచిస్తే).. ఇప్పటివరకూ జరిగిన విషయాల్లో హ్యాపీగా ఉన్నాను. కానీ నేను గతంలో ఎంచుకున్న కొన్ని కథల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. నేను వాటి గురించి విడమర్చి చెప్పలేను.. మీకు అర్థమయ్యిందనుకుంటా(నవ్వుతూ)..

ప్రశ్న) మీరు ఇప్పటి వరకూ ఎందుకు ట్విట్టర్లోకి రాలేదు? మీ ఫాన్స్ చాలా మంది నన్ను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమన్నారు..

స) వచ్చే సంవత్సరం అయినా రావచ్చు లేదా ‘బాహుబలి’ తర్వాత అయినా రావచ్చు ఖచ్చితంగా నాకు తెలియదు. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.

ప్రశ్న) మిమ్మల్ని ఫ్లాప్స్ భాదిస్తాయా లేదా వాటి ద్వారా నా కెరీర్ కి సంబందించిన విషయాలు నేర్చుకున్నానని అనుకుంటారా?

స) లేదండి, ఫ్లాప్స్ నాన్ను భాదిస్తాయి, వారిని నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. నేను నా నిర్మాతల, నా చుటూ ఉన్న వారి గురించి కేర్ తీసుకుంటాను. నేను ఏమి తప్పు చేసానా అని పరిశీలించి నా తర్వాతి ప్రాజెక్ట్స్ లో అవి జరక్కుండా చూసుకుంటాను.

ప్రశ్న) ‘మిర్చి సక్సెస్ అయినందుకు మీకు శుభాకాంక్షలు, గుడ్ లక్ ఫర్ బాహుబలి..

స) థాంక్యూ..(నవ్వుతూ)..

అదండీ ప్రభాస్ తో జరిగిన ఇంటర్వ్యూ.. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఎంతో వినయంతో మెలిగే స్వభావాన్ని, ఫ్రెండ్లీ నేచర్ చూసాము. ఆ రెండూ ఆయనలో చూసిన మేము ఎంతో ఇంప్రెస్ అయ్యాము. ప్రభాస్ తో మేము చేసిన ఈ ఇంటర్వ్యూ మీరు బాగా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాం…

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

Click Here For English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు