ఇంటర్వ్యూ : ఫరియా అబ్దుల్లా – లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు

ఇంటర్వ్యూ : ఫరియా అబ్దుల్లా – లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు

Published on Oct 29, 2022 2:19 AM IST

సంతోష్ శోభన్ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లైక్ షేర్ & సబ్ స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ మూవీని మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది యూనిట్. ఇక నేడు ఈ మూవీ యొక్క అనుభవాలను మీడియాతో పంచుకున్నారు ఫరియా.

 

ఈ మూవీలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏంటి ?

ఈ సినిమా ముఖ్యంగా ట్రావెలింగ్ నేపథ్యంలో సాగుతుంది. నిజానికి నాకు కూడా ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇక స్టోరీ లో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. నా పాత్రలో ఎన్నో మలుపులు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అలానే ప్రతి ఒక్క పాత్ర కూడా కథకి ఎంతో కనెక్టివ్ గా ఉంటుంది.

 

మరి ఈ లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?

ఈ సినిమాలో నేను ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తాను, అందుకోసం దేశం అంతా చుట్టేస్తాను. ఇక హీరో కూడా సేమ్ ట్రావెల్ వ్లాగర్. నా ప్రయాణంలో అతడిని కలవడం, అనంతరం ఇద్దరి పాత్రల మధ్య సాగె ప్రేమ, అలానే కథ అంతా కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ద్వారా తొలిసారిగా విదేశాల్లో అడుగుపెట్టాను. ముఖ్యంగా థాయ్ ల్యాండ్ లో ఒక సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళాము, ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. ఓవరాల్ గా లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీ నాకు ఎంతో గొప్ప మధురానుభూతిని అందించింది.

 

జాతి రత్నాలు, లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ ఈ రెండు మూవీస్ యొక్క ట్రైలర్స్ ని ప్రభాస్ రిలీజ్ చేయడం పై మీ అభిప్రాయం ?

నిజంగా లక్కీ చార్మ్ గా అనిపించింది. జాతి రత్నాలు తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసాను. నేను పూర్తి స్థాయి హీరోయిన్ గా చేసిన రెండవ సినిమా ఇది. అలానే జాతి రత్నాలు మాదిరిగా ఇది కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది.

 

హీరో సంతోష్ శోభన్ గురించి ?

తను ఎంతో మంచి హార్డ్ వర్కర్. అలానే సినిమాలపై తనకు ఎంతో ప్యాషన్ ఉంది. ఈ సినిమా ద్వారా తనతో కలిసి వర్క్ చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది.

 

దర్శకుడు మేర్లపాక గాంధీ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

ఆయన తో వర్క్ చేయడం సూపర్ ఎక్స్ పీరియన్స్ అనే చెప్పాలి. ఆయన ఫన్ ని కూడా ఎంతో నాచురల్ గా క్రియేట్ చేస్తారు. షూటింగ్ లో చాలా వరకు ఆయనని పూర్తిగా ఫాలో అయ్యాను. అందరం కలిసి ఎంతో హార్డ్ వర్క్ చేసిన ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.

 

లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీ లో మీకు సవాలుగా అనిపించిన అంశాలు ఉన్నాయా ?

ఇది మంచి అడ్వెంచరస్ మూవీ. ముఖ్యంగా ఇందులో అడ్వెంచర్ తో పాటు మంచి కామెడీ, ఫన్ కూడా ఉంటుంది. ఆడియన్స్ ని అది ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. సినిమాలో దాదాపుగా 40 శాతం వరకు అడవిలో షూటింగ్ చేసాము. అందుకోసం అక్కడే దాదాపుగా ఇరవై రోజులు ఉన్నాము, అక్కడ సెల్ సిగ్నల్ కూడా ఉండేది కాదు. ట్రైలర్ లో మీరు చూస్తే ఒక ఊబి ఉంటుంది, దానిని మేము క్రియేట్ చేసాము. ఆ సీన్స్ సినిమాలో బాగుంటాయి. మొత్తంగా ఈ మూవీ మొత్తం నాకు ఖత్రోమ్ కె ఖిలాడీ ఎక్స్ పీరియన్స్ ని అందించింది.

 

జాతిరత్నాలు లో చిట్టి పాత్రతో ఆకట్టుకోవడంతో అందరూ మిమ్మల్ని చిట్టి అనే గుర్తిస్తున్నారు, ఆ విషయంలో మీకు బాధ్యత పెరిగిందని అనిపిస్తోందా ?

నిజానికి జాతిరత్నాలు లో చిట్టి పాత్రని ఆడియన్స్ అందరూ ఎంతో అభిమానించారు. అలానే ఆ పాత్ర ఒక ఎమోషన్ గా మారింది. ఇక ఆ తరువాత చేసే సినిమాల ఎంపిక విషయమై జాగ్రత్త వహించి ముందుకి సాగుతున్నాను. అలానే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారు అనేది కూడా కీలకం కాబట్టి నేను ఎంపిక చేసుకుంటున్న పాత్రలకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడుతున్నాను. ఇక ఈ సినిమాలో మీకు చిట్టి కాదు, వసుధ నే కనిపిస్తుంది.

 

లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీలో మీకు, సుదర్శన్ కి మంచి కాంబినేషన్ ఉందని విన్నాం, దాని గురించి చెప్పండి ?

అవును నిజమే, తను చాలా ఫన్నీ పర్సన్, తనతో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ మూవీలో మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

 

కెరీర్ పరంగా మరొక రెండేళ్లు ఇలానే ఉండాలని మీకు టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ?

రెండేళ్లు మాత్రమే కాదు మరొక ఐదేళ్లు పాన్ వరల్డ్ లోనే ఉండాలని కోరిక నాకు. తమిళ్ లో విజయ్ ఆంటోని గారు హీరోగా సుశీంద్రన్ గారి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాను. ఆయన ఇతరులకు ఎంతో గొప్ప గౌరవం ఇచ్చే వ్యక్తి. మరొక 25 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటానని ఆయన చెప్పడం ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.

 

ఇకపై కెరీర్ లో ఎటువంటి రోల్స్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు ?

నాకు కెరీర్ పరంగా లిమిటేషన్స్ ఏమి లేవు. యాక్షన్, థ్రిల్లింగ్, సూపర్ నాచురల్, సైకో థ్రిల్లర్స్ ఇలా పలు రకాల పాత్రలు చేయాలని ఉంది. అయితే ఏ పాత్ర చేసినా అది రిలేటబుల్ గా ఉండాలి.

 

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

రవితేజ గారి రావణాసుర, హిందీలో ఒక సిరీస్, అలానే ఒక తమిళ్ మూవీ

 

డైరెక్షన్ పై ఆసక్తి ఉంది అన్నారు, ఎలాంటి సినిమాలు తీస్తారు ?

నాకు ఆర్ట్ ఫిలిమ్స్ తో పాటు మ్యూజికల్ సినిమాలు ఎంతో ఇష్టం. అయితే ఇప్పటికిప్పుడు కాదు పూర్తి స్థాయిలో డైరెక్షన్ చేయడానికి మరొక పదేళ్లు పడుతుంది.

మీ లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ మూవీకి ఆల్ ది బెస్ట్ థాంక్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు