ముఖాముఖి : రానా – నా ఇష్టం నా మొదటి కమర్షియల్ సినిమా

ముఖాముఖి : రానా – నా ఇష్టం నా మొదటి కమర్షియల్ సినిమా

Published on Feb 8, 2012 5:26 PM IST


యువ హీరో రానా తన నూతన చిత్రం ‘నా ఇష్టం’ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబందించి సినీమాక్స్ లో విలేఖరుల సమావేశం జరగగా ఆయనతో మేము ముచ్చటించడం జరిగింది. ఈ చిత్రం మార్చి 23న విడుదలకు సిద్ధమవుతుండగా ఆడియోని ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నారు. రానా చెప్పిన ముచ్చట్లు మీకోసం.

ప్ర: నా ఇష్టం చిత్రంపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
స: నా కెరీర్లో మొదటిసారిగా 100%కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేసాను. నా పాత్రని బాగా నేను బాగా ఎంజాయ్ చేసాను. మంచి ఎనర్జీతో సాగుతూ పాజిటివ్ వైఖరితో ఉండే పాత్రని మీరు చూడబోతున్నారు. నేను ఈ సినిమాలో తూర్పు గోదావరి జిల్లా యాసలో మాట్లాడతాను. ప్రేక్షకులు దానిని బాగా ఆస్వాదిస్తారు. అలాగే నేను ప్రతీ పాటలో డాన్స్ చేసాను. 5, 6 యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో కామెడీ కూడా ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది.

ప్ర: మీ పాత్ర ఆసక్తికరంగా ఉంది. దీని గురించి ఇంకొంత చెప్పగలరా?
స: ఇందులో నా పాత్ర పేరు గని అని పిలవబడే ఈ కుర్రాడి అసలు పేరు గణేష్. ప్రపంచంలో అతనిని మించిన స్వార్ధపరుడు ఉండడు. విచిత్రమైన మనస్తత్వం ఉన్న వాడు. అతను అవకాశాల కోసం ఎదురు చూడడు. అవకాశాలు అతని వరకు వస్తే మాత్రం వదిలి పెట్టడు. స్క్రిప్ట్ విన్న మొదటి సారే నాకు ఈ పాత్ర బాగా నచ్చేసింది. నా గత సినిమాల్లో పోషించిన పాత్ర లాగా నా వయసుకు తగ్గ యువకుడి పాత్రను పోషిస్తున్నాను.

ప్ర: మీరు డాన్సులు ఫైట్స్ చేయడం ఎంజాయ్ చేసారా?
స: అవును. నేను ప్రతి పాటలోనూ డాన్స్ చేసాను. కొత్త రకమైన డాన్స్ స్టెప్స్ ట్రై చేసాను. వాటికోసం చాలా హోం వర్క్ చేసాను. సెట్స్ కి వెళ్ళే ముందు రిహార్సల్స్ చేయడం బాగా ఉపయోగపడింది.

ప్ర: ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు అతని పనితీరు ఎలా ఉంది?
స: ప్రకాష్ చాలా అనుభవం ఉన్న టెక్నీషియన్. ఆర్టిస్ట్ ల నుండి ఏం అతనికి బాగా తెలుసు. మరియు అతని ఎనర్జీ ఆశ్చర్యకరంగా ఉంది. మంచి సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అలాగే సంగీతం పై కూడా మంచి పట్టు ఉంది. చక్రి నుండి మంచి ఆల్బం రాబట్టాడు.

ప్ర: సంగీతం గురించి చెప్పండి. చక్రి నుండి ఎలాంటి సంగీతం ఆశించొచ్చు?
స: చక్రి గత సినిమాల సంగీతం అంటే మాస్ బీట్స్ తో సాగుతుంది. కాని ఈ సారి మీరు ఆయన సంగీతం విని ఆశ్చర్యపోతారు. యువతకి నచ్చే ఫీల్ గుడ్ ఆల్బం తో రాబోతున్నాడు. ఆల్బం కూడా నన్ను బాగా ఆకట్టుకుంది.

ప్ర: జెనీలియాతో పనిచేయడం ఎలా ఉంది?
స: ఆమె మంచి నటి. అలాగే ఆమె సహకారం కూడా మరువలేనిది. ఆమె ఎంత ప్రతిభ ఉన్న నటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంక నేను మళ్లీ చెప్పాల్సిన విషయం లేదు. ఆమె ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

ప్ర: మీరు చేయబోయే సినిమాలు ఏమిటి?
స: ఇప్పట్నుండి నేను ప్రతి సంవత్సరం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి 4 నుండి 5 సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. అలాగే మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలతో సంతోషంగా ఉన్నాను. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ‘డిపార్ట్మెంట్’ మరియు క్రిష్ డైరెక్షన్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రాలు చేస్తున్నాను.

ప్ర: నా ఇష్టం నిర్మాతలతో మీ సంబంధం ఎలా ఉంది?
స: పరుచూరి కిరీటి గారు తమ మొదటి చిత్రంతోనే ‘సింహ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వారి బ్యానర్ గొప్పతనం గురించి నాకు తెలుసు కాబట్టి ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే వారికి సినిమా నిర్మాణం పై మంచు పట్టు ఉంది. మరియు వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.

ఇంతటితో ఈ ముఖాముఖి ముగిసింది. రానా మంచి ఈ చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

123తెలుగు. కామ్ టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు