బాలకృష్ణ ను మెప్పించలేకపోతున్న వినాయక్ !

బాలకృష్ణ ను మెప్పించలేకపోతున్న వినాయక్ !

Published on Jun 29, 2018 12:10 AM IST

Balakrishna vv vinayak
బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల 5 నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం తరువాత ఆయన బోయపాటి శ్రీను తో ఒక సినిమాని అలాగే వి వి వినాయక్ తో మరొక చిత్రాన్ని చేయనున్నారని తెలిసిందే .

బోయపాటి శ్రీను సినిమా జనవరి లో స్టార్ట్ కానుందని సమాచారం. ఇక వినాయక్ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట బాలకృష్ణ. దానికి కారణం ఆయనకు వినాయక్ చెప్పిన స్టోరీలు నచ్చలేదట. ఇప్పటివరకు సుమారు 10 కథలను బాలయ్యకు వినిపించిన అన్నింటీని తిరస్కరించారట. దాంతో తనకు లక్ష్మి , నాయక్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన ఆకుల శివ తో మంచి కథను రాయిస్తున్నాడట ఈ డైరెక్టర్. ఒకసారి సినిమా స్టార్ట్ చేస్తే తక్కువ సమయంలో పూర్తి చేస్తారని పేరున్న బాలకృష్ణను వినాయక్ కథ తో మెప్పిస్తాడో లేదో చూడాలి .

తాజా వార్తలు