మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!

మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!

Published on Aug 22, 2026 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘కాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ మాస్ లుక్, బాబీ మార్క్ ఎలివేషన్స్ అదిరిపోయాయి. పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న చిరు సాధారణ జీవితం గడుపుతున్న సత్యం అనే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ గ్లింప్స్ లో బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ సాంగ్ ని రీమిక్స్ వెర్షన్ తో థమన్ పూనకాలు తెప్పించాడు.

KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో, మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు