‘స్పిరిట్’పై ఆ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన.. అవసరం లేదంటున్న సందీప్ రెడ్డి..!

‘స్పిరిట్’పై ఆ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన.. అవసరం లేదంటున్న సందీప్ రెడ్డి..!

Published on Aug 22, 2026 2:00 AM IST

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రం కథ ప్రధానంగా హైదరాబాద్‌ నేపథ్యంలోనే సాగుతుందని ఆయన తెలిపారు. దీంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ హీరోను హైదరాబాద్ వ్యక్తిగా చూపిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కథ పరిధి కంటే సందీప్ వంగా మార్క్ డ్రామా, క్యారెక్టరైజేషనే సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాయి. ‘యానిమల్’ చిత్రాన్ని కూడా ఏరియా మార్చకుండా ఒకే సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తీసి ప్యాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించాడో అందరికీ తెలిసిందే. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు