మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో భాగంగా దర్శకుడు వశిష్ఠ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజువల్స్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ, రిలీజ్ అయ్యాక థియేటర్లలో సునామీ సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
“విశ్వంభర లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. రాసిపెట్టుకోండి” అంటూ వశిష్ఠ ఇచ్చిన స్టేట్‌మెంట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. అయితే, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా ట్రీట్ ఉంటుందని అభిమానులు ఆశించారు.
కానీ, ఇప్పుడు వశిష్ఠ చేసిన కామెంట్స్‌తో విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండకపోవచ్చని తేలిపోయింది. ఇక ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


