ఆల్ టైమ్ రికార్డు ను సెట్ చేసిన భీమ్లా నాయక్… ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ తో ఫస్ట్ సింగిల్!

Published on Sep 6, 2021 7:32 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే మేకింగ్ వీడియో, గ్లింప్స్ తో పాటుగా ఫస్ట్ సింగిల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ సాంగ్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు ను సెట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల అయిన ఈ చిత్రం లోని టైటిల్ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. వన్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ ను సాధించిన తెలుగు సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఈ మేరకు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :