తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా రేపు రిలీజ్ కానున్న సినిమాలోని మొదటి 10 నిమిషాల సినిమాని టీవీ లో వేయనున్నారు. ఇంతకీ ఎప్పుడు ఏ సినిమాలోని మొదటి 10 నిమిషాలు చూపించబోతున్నారని ఆలోచిస్తున్నారా?
అసలు విషయంలోకి వెళితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అనామిక’ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమాలోని మొదటి 10 నిమిషాలను ఈ రోజు రాత్రి 10 గంటలకు టీవీ9 లో ప్రసారం చేయనున్నారు.
సినిమా అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో శేఖర్ కమ్ముల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసారు.


