“సలార్” కి ఫిగర్ 100కు పైనే అట.!

Published on Jun 19, 2021 7:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కనీ వినీ ఎరుగని అంచనాలు ఇండియన్ సినిమా దగ్గర ఏర్పడ్డాయి.అయితే ఈ చిత్రంపై అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చినపుడే ఈ సినిమా హైప్ కి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తం ఆఫర్ చేసారని టాక్ వినిపించింది.

మరి ఇప్పటికీ కూడా ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో వారే ఫ్రంట్ రన్నర్ ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రం తాలూకా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకు గాను 100 కోట్ల మార్క్ మాత్రం వారు తగ్గకుండా ఆఫర్ చేస్తున్నట్టు మరో క్రేజీ గాసిప్ కూడా ఈ సినిమా ఉంది. అయితే ఇదంతా ప్రశాంత్ నీల్ కేజీయఫ్ ఎఫెక్ట్ కి తోడు ప్రభాస్ సాలిడ్ పర్సనాలిటీ తోడు కావడం వలనే జరిగిందని తెలుస్తుంది. ఫైనల్ గా మాత్రం ఈ సినిమా డిమాండ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :