100కోట్ల క్లబ్ లో చేరనున్న బాలీవుడ్ చిత్రం!

Published on Mar 28, 2019 4:00 am IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా జంటగా నటించిన తాజా చిత్రం ‘కేసరి’ ఇటీవల విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొని బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం మొదటి రోజు21 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక వీక్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్ల తో కేవలం 5 రోజుల్లో దేశ వ్యాప్తంగా 93.49 కోట్ల వసూళ్లను రాబట్టింది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం 100కోట్ల క్లబ్ లో చేరనుంది. ఐపీఎల్ ను తట్టుకొని ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. దాంతో ఈ చిత్రం ఈ ఏడాదిలో బాలీవుడ్ కి మరో విజయాన్ని అందించింది.

1897 లో జరిగిన సారాగడి యుద్ధం ఆధారంగా అనురాగ్ సింగ్ తెరక్కించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More