రామ్ “ది వారియర్” హిందీ వెర్షన్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

రామ్ “ది వారియర్” హిందీ వెర్షన్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on Dec 19, 2022 7:01 PM IST

రామ్ పోతీనేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం లో రామ్ డాక్టర్ గా మరియు పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను అలరించగా, హిందీ వెర్షన్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది.

యూ ట్యూబ్ లో ఈ సినిమా కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ కూడా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. 1.5 మిలియన్స్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇలా 100 మిలియన్స్ ను సాధించడం, ఈ చిత్రం రామ్ పోతినేనికి వరుసగా 7 వ చిత్రం. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు