ఈ శుక్రవారం ఏకంగా 11 చిత్రాలు పోటీపడనున్నాయి !

ఈ శుక్రవారం ఏకంగా 11 చిత్రాలు పోటీపడనున్నాయి !

Published on Jun 26, 2018 5:02 PM IST

TFI
శుక్రవారం వస్తుందంటే చాలు థియేటర్స్ అన్ని సినిమాలతో కళకళలాడిపోతాయ్. అలాగే ఈ శుక్రవారం ఏకంగా 11 సినిమాలు పోటీపడుతూ మరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవి ఈ నగరానికి ఏమైంది ?, యుద్ధభూమి, శంభో శంకర, సూపర్ స్కెచ్, డ్రాహోమ్యాన్ద్, సంజీవని, ఎస్కేప్ 2, కనుల్లో నీ రూపమే, నా లవ్ స్టోరీ, ఐపీస్ సెక్షన్, సంజు ద మూవీ. ఐతే వీటిల్లో
ఈ నగరానికి ఏమైంది ? యుద్ధభూమి, లాంటి రెండు మూడు సినిమాల మీద తప్ప, మిగతా వాటి మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు.

పైగా పబ్లిసిటీ హాడావుడి కూడా ఎక్కడా భారీ ఎత్తున కనిపించట్లేదు. మరి ఆ చిత్రాలు ‘ఈ నగరానికి ఏమైంది ? యుద్ధభూమి’ చిత్రాలను తట్టుకొని నిలబడతాయా అంటే డౌటే మరి. కాస్తో కూస్తో తెలుగు సినిమాల్లో శంభో శంకర, నా లవ్ స్టోరీ చిత్రాల పేర్లు ప్రేక్షకుల తెలిసాయి. ఏమైనా ఈ శుక్రవారం పదకుండు చిత్రాలు విడుదలవుతున్నా ఈ నగరానికి ఏమైంది ? చిత్రానికి గట్టిగా పోటీ ఇచ్చే చిత్రం లేదనే చెప్పాలి.

తాజా వార్తలు