అంచనాలను పెంచేసిన 118 టీజర్ !

Published on Dec 18, 2018 10:50 am IST

కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈ టీజర్ ఆకట్టుకొనేలా వుంది. సస్పెన్స్ తో కూడిన ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తుండగా షాలిని పాండే ఆయన సతీమణి గా నటిస్తుంది. ఒక ముఖ్యమైన పాత్రలో నివేత థామస్ నటిస్తుంది.

ఇక మొత్తానికి ఈ టీజర్ ప్రామిసింగ్ గా ఉండంతో కళ్యాణ్ రామ్ ఈ చిత్రం తో బౌన్స్ బ్యాక్ అయ్యేలాగే వున్నాడు. గుహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈచిత్రం 2019 జనవరిలో విడుదలకానుంది .

టిజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :