తారక్, జక్కన్నల మాయాజాలంకు పదమూడేళ్ళ.!

Published on Aug 15, 2020 12:32 pm IST

మన టాలీవుడ్ లో కొన్ని కాంబోలు అంటే ఆ ఇంపాక్టే వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి ఎన్నో క్రేజీ కాంబోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు జక్కన్న రాజమౌళిల కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు రాగా నాలుగోది సన్నద్ధం అవుతుంది. అయితే ముందు మూడు చిత్రాలలో “యమదొంగ” సినిమాకు మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందని చెప్పాలి.

రాజమౌళి నుంచి వచ్చిన భారీ విజువల్ వండర్ చిత్రాలు జాబితా అంటే మొదటగా “బాహుబలి”, “మగధీర” చిత్రాలు ఎక్కువ మందికి గుర్తుకు రావొచ్చేమో కానీ 2007 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన “యమదొంగ” చిత్రమే వాటికి నాంధి పలికింది అని చెప్పాలి. ఆ టైం లో ఈ చిత్రంలో చూపించిన గ్రాఫిక్స్ కానీ సెట్స్ కానీ విజువల్స్ కానీ ఒక వండర్.

వీటన్నిటికీ తారక్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ మరియు రాజమౌళి కంటెంట్ ఎన్నో రికార్డులను అప్పుడు తిరగేసాయి. అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మాయాజాల చిత్రం నేటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More