
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోవడమే కాకుండా టాలీవుడ్ లో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీస్ కి ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులని మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వారిని ఉర్రూతలూగించింది. ఈ సినిమా 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయ్యింది, అనగా ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి 14 ఏళ్ళు అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా నటించిన ఈ సినిమాకి ఎస్.జె సూర్య డైరెక్టర్.
ఈ సినిమా అప్పటి వరకూ వచ్చిన డిఫరెంట్ అన్ని లవ్ స్టోరీస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ – భూమికల మధ్య నడిచే కెమిస్ట్రీ క్రియేట్ చేసిన మేజిక్, ఎవర్గ్రీన్ గా నిలిచిపోయిన కొన్ని సీన్స్ మరియు థియేటర్స్ లో డాన్సులు వేయించిన పాటలు ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’ అనే పాట ఇప్పటికీ ట్రెండ్ సెట్ చేస్తోంది. అప్పట్లోనే ఈ సినిమా 101 సెంటర్స్ లో 50 రోజులు, 80 సెంటర్స్ లో 100 రోజులు, 5 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది . అలాగే నైజాంలో అప్పటి వరకూ ఉన్న రికార్డ్స్ ని క్రాస్ చేసి టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ ట్రెండ్ సెట్ మూవీ 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర టీంకి శుభాభినందనలు తెలియజేస్తున్నాం.

