భాష ఏదైనా దంచి కొడుతున్న పుష్ప…సామీ సామీ కి భారీ రెస్పాన్స్!

భాష ఏదైనా దంచి కొడుతున్న పుష్ప…సామీ సామీ కి భారీ రెస్పాన్స్!

Published on Nov 30, 2021 6:45 PM IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలకి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి విడుదల సామీ సామీ పాట తమిళ్ వెర్షన్ 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తమిళ్ వెర్షన్ కి వివేకా లిరిక్స్ రాయగా, రాజ లక్ష్మీ సేతి గణేష్ పాడటం జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా వస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు