చెన్నై లో 2.0 అల్ టైం రికార్డు !

Published on Jan 4, 2019 2:57 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్- శంకర్ ల కలయికలో తెరకెక్కిన 2.0 గత ఏడాది నవంబర్ 29న విడుదలై నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ చిత్రం తాజాగా చెన్నై లో అల్ టైం రికార్డు ను సొంతం చేసుకుంది. అక్కడ ఈ సినిమా 24కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇప్పటివరకు ఇవే చెన్నై లో అత్యధిక కలెక్షన్లు కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం 500కోట్ల ఫై చిలుకు గ్రాస్ ను రాబట్టింది.

బాలీవుడ్ లో ఈ చిత్రం బాహుబలి తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ సినిమా గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో ఈచిత్ర హిందీ వెర్షన్ 200కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక తెలుగులోనూ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టినా ఎక్కువ రేట్లకు సినిమా ను అమ్మడంతో నిర్మాతలకు లాభాలు రాలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :

X
More