రజినీకాంత్ నటించిన రోబోకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘2.0’ చిత్ర టీజర్ ని ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో రిలీజ్ చేయనున్నారని సమాచారం . ఐపిఎల్ ఫైనల్ ఈ నెల 27 న ముంబై లో జరుగనుంది. అదే సమయంలో ఈ చిత్ర హీరో సూపర్ స్టార్ రజిని కాంత్, అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లు ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేయనున్నారని కూడ తెలుస్తోంది.
అలాగే ఫైనల్ మ్యాచ్ సందర్బంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాను నటిస్తున్న తాజా చిత్రం ‘రేస్ 3’ మూవీలోని సాంగ్ తో లైవ్ ఫెరఫార్మ్ చేస్తున్నారని తెలిసింది. ఇక 2.0 చిత్రం ఇప్పటికే రిలీజ్ కావల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తుండగా అమీ జాక్సన్ కథానాయిక పాత్రలో కనిపిచనుంది.


