2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఓబులమ్మ పాట!

2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఓబులమ్మ పాట!

Published on Aug 29, 2021 8:30 PM IST

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కొండ పొలం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా విడుదల అయిన ఓబులమ్మ వీడియో సాంగ్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కి సంగీతం కీరవాణి అందిస్తుండటం విశేషం.

ఈ ఓబులమ్మ పాట కి లిరిక్స్ కీరవాణి అందించడం జరిగింది. సత్య యామిని మరియు పివిఎన్ఎస్ రోహిత్ లు స్వర పరిచారు. తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు