ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్న 2.0 !

ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్న 2.0 !

Published on Oct 20, 2018 4:00 AM IST

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రోబో సీక్వెల్ 2.0 చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుంది. దాంతో ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచుతుంది చిత్ర టీం. దాంట్లో భాగంగా ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ వీడియో ను రేపు ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈచిత్రం యొక్క ట్రైలర్ విడుదల వేడుకను త్వరలోనే గ్రాండ్ గా జరుపనున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ , బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో పోషించిన ఈచిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు