మన ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ భారీ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం భారతదేశ చరిత్రలోనే ఎనీ కేటగిరీలో ఆస్కార్ ని అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే సరిగ్గా ఇదే మార్చ్ 12న RRR సినిమాలో నాటు నాటు పాటకి ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ వచ్చింది.
దీనితో ఈ ఎపిక్ అండ్ ప్రైడ్ మూమెంట్ ని చిత్ర యూనిట్ ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు రెండేళ్ల కితం దేశం దద్దరిల్లిన మూమెంట్ ఇది అంటూ సాంగ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై సాలిడ్ బిట్ ని పోస్ట్ చేసి RRR ఘనతని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి అద్భుతమైన ఆల్బమ్ ని ఈ చిత్రానికి అందించారు.
2 Years back
Desam Daddarillina moment ????#RRRMovie #NaatuNaatu pic.twitter.com/BwdmdfLRV8— DVV Entertainment (@DVVMovies) March 12, 2025