2020లో క్రేజీ కాంబినేషన్స్ లో వస్తున్న బాబాయ్-అబ్బాయ్.

Published on Dec 9, 2019 8:31 am IST

నందమూరి అభిమానులకు 2020 చాలా ప్రత్యేకం కానుంది. దానికి కారణం బాలయ్య, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్స్ లో ప్రాజెక్ట్స్ చేయడమే. ఈ ఇద్దరు హీరోలు తమకు కలిసొచ్చిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో చిత్రాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తనకు మొదటి హిట్ మరియు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చేస్తుండగా, బాలయ్య సింహ, లెంజెడ్ వంటి రెండు సూపర్ హిట్ మూవీస్ కి దర్శకత్వం వహించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించేశారు.

రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా చిత్రంగా 10భాషలలో విడుదల కానుంది. రాజమౌళి సినిమా అంటే రికార్డు ల వేట గురించి మాట్లాడుకోవడమే తప్ప జయాపజయాల ప్రస్తావన ఉండదు కాబట్టి ఎన్టీఆర్ నుండి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బాలయ్య బోయపాటి సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో బోయపాటి బాలయ్యను గత చిత్రాలకు మించి పవర్ ఫుల్ గా చూపిస్తాడు అనడంలో సందేహం లేదు.వచ్చే ఏడాది నందమూరి హీరోలైన ఎన్టీఆర్, బాలయ్య తమ ఫ్యాన్స్ కి కన్నుల పండుగ లాంటి సినిమాలతో రావడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More