మన టాలీవుడ్ మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కి అంటూ కొన్ని సెపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎన్ని ప్లాప్ లు పడ్డా కూడా పూరి నెక్స్ట్ సినిమా అంటే అందరిలో ఒక కుతూహలం ఏర్పడుతుంది. ఇలా ఫైనల్ గా తాను చేస్తున్న చిత్రం “స్లమ్ డాగ్” మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కంప్లీట్ అయ్యి మంచి సమయం కోసం ఎదురు చూస్తుంది.
ఇక ఈ సినిమా పూర్తయ్యాక ఇంకా విడుదల కాకుండానే ఆల్రెడీ పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందట. ఇది కూడా మంచి మాస్ కలయికే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ హీరో ఎవరు ఏంటి అనేది రివీల్ కాలేదు. మంచి మాస్ హీరో అంటున్నారు కాబట్టి కొన్ని కీలక పేర్లే లిస్ట్ లో చేర్చుకోవచ్చు. మరి ఎవరితో పూరీ సినిమా ఉంటుందో ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం విజయ్ సేతుపతితో చేసిన సినిమాకి ఇంకా సరైన డేట్ లాక్ కావాల్సి ఉంది.


