ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా ముగింపుకి వచ్చేసింది. అన్ని సార్లూ అనుకున్నట్టు గానే ఈ ఏడాది కూడా ఇంత త్వరగా పూర్తయిపోయిందా అనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా లవర్స్ కి కూడా ఈ ఏడాది చివరి వీకెండ్ చివరి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తే..
ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో ఓరోజు ముందు నుంచే సినిమాల హడావుడి స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వస్తున్నాయి. ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా అర డజను కంటే ఎక్కువే సినిమాలు వచ్చేస్తున్నాయి. దీనితో ఈ ఏడాది ముగింపు సినిమాలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఓ లుక్కేద్దాం రండి..
రేస్ లో మొత్తం 8 సినిమాలు ఆ 4 సినిమాలపై మాత్రం మంచి బజ్
డిసెంబర్ 25 క్రిస్మస్ వీకెండ్ లో భాగంగా తెలుగు, కన్నడ, మలయాళం ఇలా ముఖ్య భాషలు నుంచి మొత్తం 8 సినిమాలు అయితే ఉన్నాయి. మరి వీటిలో సాలిడ్ బజ్ ఉన్న ఆ నాలుగు సినిమాలు మాత్రం మన తెలుగు నుంచే ఉండడం విశేషం. అవన్నీ వరుసగా చూస్తే..
‘ఛాంపియన్’
యువ హీరో రోషన్ మేక నటించిన ఈ సినిమా కొన్నేళ్ల కితమే అనౌన్స్ చేసినప్పటికీ దీనికి సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాత స్వప్న దత్, దర్శకుడు ప్రదీప్ అద్వైతం అండ్ టీం వదిలిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్ లోకి పర్ఫెక్ట్ గా వెళ్లాయి. అలాగే ప్రమోషన్స్ కూడా అంతే గ్రాండ్ మ్యానర్ లో చేస్తుండడంతో ఛాంపియన్ పట్ల ఆడియెన్స్ లో ఈ వీకెండ్ కి మంచి బజ్ సెట్టయ్యింది.
‘శంబాల’
సాలిడ్ హిట్ కోసం గత కొంత కాలం నుంచి చూస్తున్న ఆది సాయి కుమార్ నటించిన ఓ ఇంట్రెస్టింగ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమానే ఈ ‘శంబాల’. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో నుంచి ఇప్పుడు వరకు అంచెలంచెలుగా ఈ చిత్రం మంచి బజ్ ని ఆడియెన్స్ ని పెంచుకుంటూ వచ్చింది. ఇలా శంబాల కూడా ఇప్పుడు ఆడియెన్స్ వాచ్ లిస్ట్ లో ఈ వీకెండ్ కి చేరింది.
‘ఈషా’
ఈ ఏడాది ముగింపుకి ఒక హారర్ ముగింపుని ఇవ్వాలని ఈ సినిమా మేకర్స్ ఫిక్స్ అయినట్టు ఉన్నారు. నిజానికి ఈ సినిమా క్రిస్మస్ రేస్ లో ఉందని పెద్దగా కాస్ట్ అండ్ క్రూ లాంటివి కూడా జెనరల్ ఆడియెన్స్ కి తెలియకపోవచ్చు. కానీ అలాంటి స్టేజి నుంచి హెబా పటేల్ నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ లో ఆడియెన్స్ ఎదురు చూసే సినిమాల్లో డెఫినెట్ గా చూడాల్సిన ఒక సినిమాగా ఇది నిలవడం విశేషం. ఇందుకు కారణం ఇదొక హారర్ సినిమా అనే కాకుండా దీనిని మేకర్స్ ప్రమోట్ చేసిన విధానం కూడా చాలామందిలో అటెన్షన్ ని అందుకుంది. సో ఇలా ఈషా కూడా మంచి బజ్ ని సెట్ చేసుకుంది.
‘దండోరా’
ఇటీవల ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తర్వాత మళ్ళీ ఆ తరహా బజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఈ దండోరా సినిమానే అని చెప్పాలి. నటుడు శివాజీ తదితరులు సాలిడ్ పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా ట్రైలర్ తో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. పైగా అదనపు కాంట్రవర్సీలు కూడా ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో మరింత చర్చకి దారి తీశాయి. ఇలా ‘దండోరా’ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మొత్తం ఈ 4 సినిమాలు డెఫినెట్ గా చూడాలనే ఈ వీకెండ్ లో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాల పరిస్థితి బాగానే ఉంది కానీ మరో 4 సినిమాలు మాత్రం మినిమమ్ ఇంట్రెస్ట్ ని తెలుగు ఆడియెన్స్ లో క్రియేట్ చేయలేకపోవడం ఒకెత్తు అయితే వీటిలో నోటెడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మరి అవి కూడా చూద్దాం.
మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘వృషభ’ అనే సినిమా ఎపుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి అనౌన్స్ చేశారు కానీ దీనికి సరైన ప్రమోషన్స్ చేయలేదు. దీనితో లాస్ట్ టైం వచ్చిన బరోజ్ కంటే తక్కువ రీచ్ అయ్యింది. తనతో పాటుగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఉన్నాడు. సుదీప్ నటించిన యాక్షన్ చిత్రం ‘మార్క్’ పరిస్థితి కూడా ఇంతే లెవెల్లో ఉంది. ఇక వీటితో పాటుగా రేస్ లో చిన్న సినిమాలు ‘పతంగ్’ ఇంకా ‘బ్యాడ్ గర్ల్స్’ లాంటివి వస్తున్నట్టు చాలా మందికి తెలియకపోవచ్చు.
అయితే మధ్యలో ఏర్పడ్డ కొంత గందరగోళం మూలాన ముందే రావాల్సిన సినిమాలు డేట్స్ మార్చుకోవడంతో ఈ రష్ ఏర్పడింది అని చెప్పొచ్చు. లేకుంటే ఈ వీకెండ్ కూడా రిలీజ్ సాఫీగానే ఉంది ఉండేది కాబోలు.


