యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల హీరోగా సాక్షి హీరోయిన్ గా పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ యాంటీ హీరో పాత్రలో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రమే “మోగ్లీ 2025”. డీసెంట్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకుంది. ఇక థియేటర్స్ లో రన్ తర్వాత ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా తాలూకా డిజిటల్ రైట్స్ ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఈ కొత్త ఏడాది కానుకగా మన తెలుగు నుంచి మొదటి స్ట్రీమింగ్ సినిమాగా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ లో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో వైవా హర్ష తదితరులు నటించగా కాల భైరవ సంగీతం అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


