ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాజా సాబ్ తో వచ్చారు కానీ ఇది డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది లోనే దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న సినిమా “ఫౌజీ” కూడా విడుదల కావాల్సి ఉంది కాని వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అది కూడా 2027 కే అని కూడా టాక్.
సో దీనితో 2027లో మాత్రం ప్రభాస్ అభిమానులుకి ఒకటి కాదు మొత్తం మూడు ట్రీట్ లు ఉంటాయని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న స్పిరిట్ అలాగే బాహుబలి యానిమేషన్ సినిమా బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా ఈ 2027 లోనే విడుదల కానున్నాయి. సో 2027 మాత్రం ప్రభాస్ నామ సంవత్సరం అనే చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తాయో చూడాలి.


