’21st సెంచరీ లవ్’ ఆడియో లాంచ్ విశేషాలు

’21st సెంచరీ లవ్’ ఆడియో లాంచ్ విశేషాలు

Published on Nov 13, 2015 8:00 PM IST

21st-Century-Love
గోపీనాథ్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తూ తెరకెక్కించిన సినిమా ’21st సెంచరీ లవ్’. గోపీనాథ్ సరసన విష్ణు ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను బ్రాండెడ్ సిగ్నేచర్ మూవీస్ పతాకంపై పి. నరేందర్ నిర్మించారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను హైద్రాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా సందీత దర్శకులు కనిష్క అందించిన ఆడియోతో పాటు ’21st సెంచరీ లవ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రతాని రామకృష్ణ గౌడ్, వేముల వాడ మదన్ కుమార్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, రాజ్ కందుకూరి, మనోజ్ నందన్ తదితరులు అతిథులుగా హాజరై ఆడియో, ట్రైలర్‌లను విడుదల చేశారు. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా హీరో, దర్శకుడు గోపీనాథ్ మాట్లాడుతూ.. పర్సనాలిటీ డెవెలప్‌మెంట్ ఉపన్యాసాలతో ఎంతో మందిని మంచి వైపు నడిపించిన తాను, సినిమాల ద్వారానూ మంచి మెసేజీ అందించాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించానని తెలిపారు. ఈ సినిమా ప్రేమ, ఆకర్షణ అనే అంశాలకు సరైన అర్థాన్నిచ్చే సినిమాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని నిర్మాత నరేందర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు