30 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సామీ సామీ లిరికల్ వీడియో!

30 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సామీ సామీ లిరికల్ వీడియో!

Published on Nov 5, 2021 5:51 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన మూడవ లిరికల్ వీడియో సామీ సామీ యూత్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ పాట కి అన్ని బాషల్లో కలిపి 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. 7 రోజుల్లో 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో పాటుగా 825కే లైక్స్ సాధించడం విశేషం. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు