30 మిలియన్ వ్యూస్ సాధించిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్”

30 మిలియన్ వ్యూస్ సాధించిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్”

Published on Aug 12, 2021 2:18 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరిట విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ టీజర్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ ప్రస్తుతం 30 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాక టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం తో ఈ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి 888కే లైక్స్ సాధించగా, వన్ మిలియన్ లైక్స్ వైపు దూసుకు పోతుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

వీడియోని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు