ఓటీటీ లో ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ !

Published on May 23, 2021 8:00 pm IST

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించింది. అయితే .ఇక ఈ సినిమా కోసం డిజిటల్ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో వచ్చేసింది. ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలో సినిమా మిస్‌ అయినవాళ్లు అంతా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చారు.

ఈ సినిమా పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌త్యేకించి ‘నీలి నీలి ఆకాశం’ పాట సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించింది. ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కార్తీక్ శ్రీ‌నివాస్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

సంబంధిత సమాచారం :