‘సౌఖ్యం’ బాహుబలి స్పూఫ్ కి సూపర్ క్రేజ్

‘సౌఖ్యం’ బాహుబలి స్పూఫ్ కి సూపర్ క్రేజ్

Published on Dec 6, 2015 2:05 PM IST

prudvi
మాచో హీరో గోపీచంద్ తనకి ‘యజ్ఞం’ రూపంలో మొదటి హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరితో కలిసి చేస్తున్న మరో సినిమా ‘సౌఖ్యం. వరుసగా హిట్ సినిమాలను అందించి ఫుల్ జోష్ మీదున్న గోపీచంద్ అప్పుడే ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ అందించిన ఈ సినిమా ఆడియోని, అలాగే సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే ఈ చిత్ర టీం ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.

ఈ టీజర్లో బాహుబలి స్పూఫ్ చేసారు.. ఈ మధ్య కాలంలో తన కామెడీ మార్క్ తో బాగా ఫేమస్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఈ టీజర్ చివర్లో బాహుబలి సినిమాకి స్పూఫ్ గా బాహుబలి సినిమాలోని ఫేమస్ సాంగ్ ఎవ్వడంట ఎవ్వడంట సాంగ్ కి స్పూఫ్ గా చేసిన సీన్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ ‘సౌఖ్యంలోను నేను ఓ సినిమా హీరోగా కనిపిస్తాను. నా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండడంతో హిట్ సినిమాల్లోని అన్ని పాత్రలను బేస్ చేసుకొని ఓ సినిమా చేస్తాను. అప్పుడు వచ్చే సీన్ అది. ఇది కాకుండా బెంగాల్ టైగర్ లో కూడా బోర్న్ స్టార్ అనే ఒక స్టార్ గా కనిపిస్తాను. ఈ రెండు సినిమాల్లో న అపాత్రాలు ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయని’ పృథ్వి తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు