‘పుష్ప’ యాక్షన్ కోసం 39 కోట్లు ?

Published on Apr 19, 2021 10:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా యాక్షన్ సీన్స్ బడ్జెట్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.39 కోట్లు ఖర్చు పెడుతున్నారట. పాన్‌ ఇండియా స్థాయి సినిమా కావడంతో ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడకుండా బెస్ట్ ఫైట్స్ కంపోజ్ చేయమంటూ ఎంకరేజ్ చేస్తున్నారట. మరి బన్ని కెరీర్‌లో ‘పుష్ప’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. మొత్తానికి ‘తగ్గేదే లే’ అంటూ ఊరమాస్‌ గెటప్‌లో ‘పుష్పరాజ్‌’గా అలరించేందుకు బన్నీ సిద్ధమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది

సంబంధిత సమాచారం :