OTT Release: రియల్ క్రైమ్ స్టోరీతో ‘4 గర్ల్స్’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

OTT Release: రియల్ క్రైమ్ స్టోరీతో ‘4 గర్ల్స్’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

Published on Dec 31, 2025 7:56 AM IST

4 Girls Movie OTT Release

యూనిక్ పిక్చర్స్ (Uniquek Pictures) బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘4 గర్ల్స్’ (4 Girls) నేరుగా ఓటీటీ వేదికగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, హంగామా ప్లే, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, టాటా ప్లే బింజ్, వాచో తదితర ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గ్యాంగ్ రేప్ ఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా.. తన చెల్లికి జరిగిన అన్యాయానికి అక్క, ఆమె స్నేహితులు కలిసి ఎలా పగ తీర్చుకున్నారనేది ఆసక్తికరంగా మలిచారు. చట్టం ద్వారా న్యాయం దక్కనప్పుడు, నేరస్థులను సొంతంగా పట్టుకుని ఎలా శిక్షించారనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

సినిమాకు వస్తున్న స్పందన పట్ల నిర్మాతలు యు. నరసింహులు, ఎస్. రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. తమ తొలి ప్రయత్నంగా సందేశాత్మక చిత్రాన్ని అందించడం ఆనందంగా ఉందనీ, సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేసిన బిసినీట్ (Bcineet) అధినేత బోయపాటి దిలీప్ కుమార్‌కు (DK Boyapati) కృతజ్ఞతలు తెలిపారు. ఎస్. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు