సాధారణంగా నూతన సంవత్సరం (New Year) రోజున సినిమా థియేటర్ల వద్ద హడావుడి మామూలుగా ఉండదు. ఈసారి కూడా 2026 జనవరి 1న బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా, ఎక్కడా పెద్దగా సౌండ్ (Sound) లేదు.
2026 జనవరి 1న న్యూ ఇయర్ (New Year) కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలలో స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ న్యూ ఇయర్ రోజున రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
సైక్ సిద్ధార్థ (Psych Siddhartha):
డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడి, ఫైనల్‌గా న్యూ ఇయర్ రోజున థియేటర్లలోకి దిగుతోంది. నందు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డార్క్ కామెడీ కంటెంట్‌తో రానుంది.
సఃకుటుంబానాం (Sahakutumbaanaam):
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా మణిశర్మ సంగీతంతో తెరకెక్కిన ‘సఃకుటుంబానాం’ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు.
వనవీర (VanaVeera):
గతంలో ‘వానర’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం, ఇప్పుడు టైటిల్ మార్చుకుని ‘వనవీర’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మైథలాజికల్ రూరల్ డ్రామాగా ఈ చిత్రాన్ని అవినాష్ తిరువీధుల డైరెక్ట్ చేశారు.
45 ది మూవీ (45 The Movie):
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ఈ భారీ సినిమా తెలుగు డబ్ (Telugu Dub) వెర్షన్ జనవరి 1న రిలీజ్ అవుతోంది.
మార్క్ (Mark):
కన్న స్టార్ కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్క్’. కన్నడలో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు మరియు తమిళ వెర్షన్లలో జనవరి 1న రిలీజ్ కానుంది
.
గత వైభవం (Gatha Vaibhavam):
ఇది కూడా కన్నడ-తెలుగు బైలింగ్వల్ (Bilingual) సినిమాగా న్యూ ఇయర్ రోజున వస్తోంది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, దుష్యంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
బజ్ (Buzz) ఎందుకు లేదు?
లిస్ట్ చూస్తే 6 సినిమాలున్నాయి.. అందులో సుదీప్, శివరాజ్ కుమార్ వంటి పెద్ద స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆడియన్స్ లో, సోషల్ మీడియాలో (Social Media) పెద్దగా చర్చ జరగట్లేదు. దీనికి ప్రధాన కారణం ‘సంక్రాంతి రేస్’ (Sankranti Race) అని చెప్పుకోవచ్చు.
మరో వారం రోజుల్లో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab), చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి. ప్రేక్షకుల మూడ్ మొత్తం ఆ పెద్ద సినిమాల పైనే ఉంది. అందుకే జనవరి 1న వస్తున్న ఈ సినిమాల ప్రమోషన్స్ (Promotions) జనాల్లోకి బలంగా వెళ్లలేకపోయాయి.
‘మార్క్’ మరియు ’45’ వంటి సినిమాలకు కన్నడలో మంచి క్రేజ్ ఉన్నా, తెలుగులో మాత్రం ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక మిగిలిన చిన్న సినిమాలు కేవలం ‘కంటెంట్’ (Content) మీద నమ్మకంతోనే రిస్క్ చేసి రిలీజ్ అవుతున్నాయి.
మరి ఈ ‘సైలెంట్’ రిలీజ్ లలో ఏ సినిమా హిట్ కొట్టి న్యూ ఇయర్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలంటే రేపటి వరకు వెయిట్ (Wait) చేయాల్సిందే!


