ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటే ‘రామాయణ’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరామ చంద్రమూర్తిగా, సాయి పల్లవి సీతాదేవిగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ చిత్రం మునుపెన్నడూ లేని అత్యంత ప్రతిష్టాత్మక విలువలతో తీస్తున్నారు. అయితే ఈ సినిమా తాలూకా అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ జూలై 24న విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రన్ టైం లాక్ అయినట్టుగా తెలిసింది.
4 నిమిషాల ట్రైలర్ కట్ కి సెన్సార్ పూర్తి
ఎపిక్ రామాయణ ట్రైలర్ ని మేకర్స్ 4 నిమిషాల పాటుగా సాగే విజువల్ వండర్ గా ప్లాన్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దీనికి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది.
ముందు ట్రోల్స్.. ఆదిపురుష్ లానే మ్యాజిక్ చేస్తుందా?
గతంలో ఇదే రామాయణ నేపథ్యంలో వచ్చిన భారీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Prabhas Adipurush) కి కూడా రామాయణ లానే ముందు టీజర్ గ్లింప్స్ కి ట్రోల్స్, నెగిటివ్ టాక్ వచ్చింది. మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ చాలా వీక్ గా ఉండడంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ ఊరుకోలేదు. దీనితో ఆదిపురుష్ నుంచి వచ్చిన మొదటి ట్రైలర్ మాత్రం సెన్సేషన్ ని సెట్ చేసింది. దానికి వచ్చిన విపరీతమైన పాజిటివ్ టాక్ ఆ సినిమా వైపు మళ్ళీ జనం పాజిటివ్ గా చూసే విధంగా చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో రామాయణ ట్రైలర్ కూడా వర్క్ అయితే మాత్రం డెఫినెట్ గా అది పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది తెలియాలి అంటే ఈ జూలై 24 వరకు ఆగాల్సిందే.


