చిరు మొదటి సినిమాకు 40 ఏళ్ళు

చిరు మొదటి సినిమాకు 40 ఏళ్ళు

Published on Jun 21, 2019 7:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. స్వయం కృషితో ఎదిగి, విజయాన్నే ఇంటి పేరుగా చేసుకుని, ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న హీరో. ఈయన సినీ ప్రయాణం మొదలై నేటికి 40 ఏళ్ళు గడించింది. ఆయన మొట్ట మొదట నటించిన చిత్రం ‘పునాదిరాళ్ళు’ ఇదే జూన్ 21వ తేదీన 1978లో విడుదలైంది. గుడిపాటి రాజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

అయితే ఈ సినిమా కంటే ముందే చిరు చేసిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలకావడంతో ఇప్పటికీ దాన్నే అయన మొదటి సినిమా అని అంటుంటారు. కానీ నిజానికి చిరు మొట్టమొదటిసారి కెమెరా ముందుకొచ్చి నటించింది మాత్రం ‘పునాదిరాళ్లు’ సినిమాలోనే. ఈ చిత్రం తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా నటించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ అయ్యారు.

నిర్విరామంగా 149 సినిమాలు చేసిన ఆయన రాజకీయాల్లోకి వెళ్లి కొంత గ్యాప్ తీసుకుని 150వ సినిమా ‘ఖైదీ నెం 150’ చేశారు. ప్రస్తుతం 151వ చిత్రం ‘సైరా’ చేస్తున్నారు. ఇలా ప్రతి సినిమాను మొదటి అవకాశంగానే భావించి పనిచేసే చిరు సినీ ప్రయాణ ఎందరో నటులకు స్ఫూర్తిదాయకమైంది. ఆయన్ను చూసి సినీ రంగంలోకి వచ్చిన ఎందరో నటులుగా, హీరోలుగా స్థిరపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు