విజయ్ ‘జననాయగన్’కి భారీ బుకింగ్ లు !

విజయ్ ‘జననాయగన్’కి భారీ బుకింగ్ లు !

Published on Jul 19, 2026 7:59 AM IST

Jana Nayagan

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జననాయగన్’ జూలై 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తించింది. నిజానికి పరిమిత స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి టిక్కెట్ల విక్రయాలు నేటి నుంచే మొదలవుతాయని చిత్ర బృందం ప్రకటించింది. ఐతే, నిన్న టికెట్లు, పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం శనివారం నాడే ‘బుక్‌మైషో’లో 40,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

ఈ డిమాండ్ ఈ చిత్రం పట్ల ఉన్న భారీ ఆసక్తిని తెలియజేస్తోంది. ఇక నేటి నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్‌లు భారీగా పెరగనున్నాయి. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాక థియేటర్స్ లో ఎట్టకేలకి గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు