మరి కొన్ని గంటల్లో ‘హలో గురు..’ టీజర్ !

మరి కొన్ని గంటల్లో ‘హలో గురు..’ టీజర్ !

Published on Sep 17, 2018 1:05 PM IST

hello
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ మరికొన్ని గంటల్లో విడుదల అవ్వనుంది.

‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే, ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్ చాలా బాగా వస్తుందని తెలుస్తోంది.

ఇక అనుపమా పరమేశ్వరన్‌ ఈ సినిమాలో ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ గా కనిపించనుంది. పైగా ఈ చిత్రంలో రామ్ – అనుపమా బావ మరదళ్లగా కనిపించనున్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు