శ్రీ విష్ణు “అర్జున ఫల్గుణ” టీజర్ కి 5 మిలియన్ వ్యూస్!

Published on Nov 13, 2021 1:00 am IST


శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి ఇటీవల టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటి వరకూ ఈ టీజర్ కి యూ ట్యూబ్ లో5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. శ్రీ విష్ణు సినిమా కి ఈ తరహా లో వ్యూస్ రావడం పట్ల అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ విష్ణు ను మేకర్స్ ఈ చిత్రం లో సరికొత్తగా చూపించడం జరిగింది. తేజ మార్ని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కొన్ని నిజ జీవిత ఘటనలు కూడా ఉన్నాయి. చిత్ర యూనిట్ త్వరలో ప్రమోషన్స్ ను షురూ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More