షాహిద్ కపూర్ “జెర్సీ” ట్రైలర్ కి 50 మిలియన్ వ్యూస్!

Published on Nov 29, 2021 1:06 am IST


షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి ఇది రీమేక్. మృణల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సచేట్ మరియు పరంపర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుద్ రవి చందర్ అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కి 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాక 852 కే కి పైగా లైక్స్ రావడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :