ఈవారమే రిలీజ్ అవుతోన్న ‘7 టు 4’
Published on Mar 29, 2016 2:07 pm IST

7to4
ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘7 టు 4’. రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒకే రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం (ఏప్రిల్ 1న) విడుదలకు సిద్ధమైంది. ఒక సరికొత్త కథాంశంతో మంచి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని దర్శక నిర్మాత విజయ్ శేఖర్ స్పష్టం చేశారు.

పోస్టర్స్, ట్రైలర్‌లు చూసి సినిమాపై ప్రేక్షకులకే కాక, ఇండస్ట్రీ వర్గాలకూ మంచి అభిప్రాయం వచ్చిందని, అందుకు తగ్గట్టుగానే అన్నిచోట్లా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తాము అనుకున్నదానికంటే బాగా జరిగిందని విజయ్ శేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక హర్రర్, థ్రిల్లర్ అంశాలతో పాటు ఓ సామాజిక కోణాన్ని కూడా ప్రస్తావించనున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమాకు.. డిజైనింగ్: గణేష్ రత్నం, కో-డైరెక్టర్: గిరీష్, పోస్ట్ ప్రొడక్షన్ చీఫ్: వి.ఉపేంద్ర, రచనాసహకారం: శ్రీకాంత్-రాజేష్-చంద్రశేఖర్, సాహిత్యం: శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం: శ్రీమతి స్నేహలతామురళి, కెమెరామెన్: ఇ. కె. ప్రభాత్-చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: ఇ. బాలు నాయక్-కె.రమేష్, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-నిర్మాణం-దర్శకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి!!

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook