జెర్సీ లో అన్ని పాటలా !

Published on Feb 5, 2019 9:49 am IST


న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న’ జెర్సీ’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా 8 పాటలు ఉన్నాయని సమాచారం. అందులో రెండు ఎమోషనల్ సాంగ్స్ , రెండు డ్యూయెట్ సాంగ్స్ అలాగే నాలుగు బిట్ సాంగ్స్ ఉంటాయట. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని ,అర్జున్ గా మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపించనుండగా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం లోని మొదటి సాంగ్ ను ఈనెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్లో ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :