వావ్.. మూడు రోజుల్లోనే 8400 కోట్లు !

Published on Apr 29, 2019 10:56 am IST

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న మార్వెల్స్ ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చిన ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులకు 1.2 బిలియన్ల డాలర్స్.. ఇండియన్ కరెన్సీలో 8400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

ఇక ఈ చిత్రం యూఎస్ లో బాక్స్ ఆఫీసు వద్ద 350 మిలియన్ల డాలర్స్ ను రాబట్టింది. మొత్తానికి ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కంటే… ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ఇప్పటివరకూ 93 మిలియన్ల డాలర్స్ ను అధికంగా కలెక్ట్ చెయ్యడం విశేషం. ఈ కలెక్షన్స్ ఇంకా భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ తెలుగు డబ్ వర్షన్ కూడా అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. పైగా ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెలుగు ప్రేక్షకులకు ఓన్ చేయడానికి ఈ సినిమాలోని డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను, తెలుగు సినిమాల్లోని డైలాగ్ లను వాడారు. దాంతో గతంలో ఏ సినిమాకు లేని విధంగా తెలుగు ప్రేక్ష‌కుల నుంచి కూడా ఈ సినిమాకు విశేషమై స్పంద‌న లభిస్తోంది.

సంబంధిత సమాచారం :