పవర్ స్టార్ మాస్ కం బ్యాక్ కు తొమ్మిదేళ్లు.!

Published on May 11, 2021 9:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితా తీస్తే అందులో దర్శకుడు హరీష్ శంకర్ తో తీసిన చిత్రం “గబ్బర్ సింగ్” చిత్రం కూడా ఒకటి. అభిమానులు చాలా డౌన్ లో ఉన్నపుడు నిరాశా నిస్పృహలతో ఉన్నపుడు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సాలిడ్ హిట్ పడితే దాని ప్రభంజనం ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది.

ఆ సినిమా నుంచే హీరోయిన్ శృతి హాసన్ ఫేట్ కూడా మారిపోయింది. అంతే కాకుండా నిర్మాత బండ్ల గణేష్ కు కూడా గబ్బర్ సింగ్ తోనే కాసుల వర్షం కురిపించారు. మరి అలా ఎన్నో రికార్డులు సెట్ చేసి ఒక పవర్ ఫుల్ మాస్ కం బ్యాక్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం విడుదలై ఈరోజు మే 11 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే గత ఏడాది గబ్బర్ సింగ్ ఎనిమిదేళ్ల ట్విట్టర్ ట్రెండ్ కూడా 13 మిలియన్ కి పైగా ట్వీట్స్ తో ఇంకా బ్రేక్ అవ్వకుండానే ఉంది. ఆ రేంజ్ లో గబ్బర్ సింగ్ చిత్రం ఇంపాక్ట్ కలిగించింది. ఇక మళ్ళీ పవన్ మరియు హరీష్ శంకర్ ల కాంబోలో ఓ సినిమా ఉంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :