మరో ఓటీటీలోకి #90’s.. ఈసారి పాన్ ఇండియా భాషల్లో..!

మరో ఓటీటీలోకి #90’s.. ఈసారి పాన్ ఇండియా భాషల్లో..!

Published on Dec 19, 2025 5:15 PM IST

#90's

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవి విన్‌లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఫ్యామిలీ వెబ్ సిరీస్ #90’s ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో శివాజీ, వాసుకి, మౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. #90’s టైటిల్‌కు తగ్గట్లుగానే 90ల కాలం నాటి జ్ఞాపకాలను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌కు స్టన్నింగ్ రెస్పాన్స్ రావడంతో ఇది పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

అయితే, ఇప్పటివరకు ఈటీవి విన్‌లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌ను తాజాగా స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. అయితే, కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటంతో దీనికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు