96 తెలుగు రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ !

Published on Mar 4, 2019 11:30 pm IST

గత ఏడాది తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ లో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించనుండగా ఓరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారు. త్వరలోనే ఈ టైటిల్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. గోవింద్ వసంత సంగీతం అందించనున్నాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటిసినిమా.

ఇక ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించిన ఈ చిత్రం క్లాసిక్ సినిమా గా మిగిలిపోయింది. మరి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More