96 అక్కడ 99గా రీమేక్ అవుతుంది !

Published on Dec 11, 2018 3:11 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి , త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 96. ఇటీవల విడుదలైన ఈచిత్రం అద్భుతమైన రివ్యూస్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఎమోషనల్ లవ్ స్టోరీ తో నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి క్యాస్ట్ & క్రూ ను ఎంపిక చేసే పనిలో వున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం కన్నడలో కూడా రీమేక్ అవుతుంది. కన్నడ స్టార్ హీరో గణేష్ , భావన జంటగా ’99’ అనే టైటిల్ తో రీమేక్ కానుంది. ప్రీతం గబ్బి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :