96 రీమేక్ అక్కడ కూడా .. !

Published on May 2, 2019 11:16 am IST

విజయ్ సేతుపతి , త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 96. గత ఏడాది విడుదలైన ఈచిత్రం కోలీవుడ్ లో కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. క్రిటిక్స్ ను సైతం మెప్పించి సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ లవ్ స్టోరీ తో నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల కన్నడ లో కూడా రీమేక్ అయ్యింది.

99 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో గణేష్ , భావన జంటగా నటించారు. నిన్న విడుదలైన ఈ చిత్రం అక్కడ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుని సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ప్రీతం గబ్బి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు.

ఇక 96 ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతుంది. శర్వానంద్ , సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి కోలీవుడ్ , శాండల్ వుడ్ లో హిట్ అనిపించుకున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More